Air-India AI 2455: తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 2455 ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ చేసారు. ఇందులో కేరళకు చెందిన నలుగురు ఎంపీలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, యూడీఫ్ కన్వీనర్ అదూర్ ప్రకాష్, తమిళనాడు ఎంపీ రాబర్ట్ బ్రూస్, కే.రాధాకృష్ణన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోడికున్నిల్ సురేష్ ప్రయాణిస్తున్నారు.
ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాడింగ్ చేయడంతో ప్రయాణీకులతో పాటు ప్రముఖ నాయకులు ఆందోళన చెందారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమానం దిగిన వెంటనే మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ ఘటనను తృటిలో తప్పిన పెను ప్రమాదం(Narrow escape from a major mishap) అని తెలిపారు.
Read more: https://teluguprabha.net/national-news/bihar-deputy-cm-two-voter-ids-controversy/
“విమానంలో రాడార్ సమస్య తలెత్తడంతో సిబ్బంది అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ కు ముందు మేము దాదాపు గంట పది నిమిషాలు గాల్లోనే ఉన్నామని అన్నారు. ఈ విషయం గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి తెలియజేశాను” అని ఆయన తెలిపారు.
యూడీఫ్ కన్వీనర్ అదూర్ ప్రకాష్ ఇచ్చిన వివరాల ప్రకారం, అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న విమానాన్ని అకస్మాత్తుగా నిలిపివేసారు. రన్‌వే మీద మరొక విమానం కనిపించడంతో, ఆ విమానం పైకి లేచింది. అనంతరం అరగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టి, సురక్షితంగా ల్యాండ్ చేసారు. ఫైలట్లు ఈ పరిస్థితిని సరైన పద్దతిలో నిర్వహించారని తెలిపారు.
విమానం ల్యాండింగ్ కోసం సమీపిస్తున్నప్పుడు రన్‌వేపై మరొక విమానం ఉందని ప్రయాణికులు తెలిపారు. ఇది ప్రయాణికులలో మరింత ఆందోళన కలిగించింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నప్పటికీ, ఈ సంఘటన విమాన రాకపోకల సమన్వయం మరియు రన్‌వే చొరబాటు ప్రమాదం గురించి ప్రశ్నలను లేవనెత్తింది.
విమానం రాడార్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా ఈ దారి మళ్లింపు జరిగిందని వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వేపై మరొక విమానం ఉండటం, పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. విమానాశ్రయ అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సాంకేతిక లోపం మరియు ల్యాండింగ్ ఆగిపోయేందుకు దారితీసిన సంఘటనల క్రమం రెండింటినీ DGCA దర్యాప్తు చేస్తుందని భావిస్తున్నారు.


