Saturday, November 15, 2025
Homeనేషనల్Air India: టెక్నికల్ లోపాలతో టేక్ ఆఫ్ కు బ్రేక్

Air India: టెక్నికల్ లోపాలతో టేక్ ఆఫ్ కు బ్రేక్

New Delhi: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరొకసారి వార్తల్లో నిలిచింది. ఎయిర్ ఇండియా విమానాలాలో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రూట్లలో నడిచే బోయింగ్ 787 విమానాలు ఇటీవలి రోజులలో వరుసగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 17 ఆగస్టు 2025న, జ్యూరిచ్ నుండి ఢిల్లీకి బయలుదేరాల్సిన AI152 విమానం, టేక్ ఆఫ్ కు సిద్ధంగా ఉండగానే ఇంజిన్ సమస్య తలెత్తి, టేక్ ఆఫ్ ను నిలిపివేయాల్సి వచ్చింది.

- Advertisement -

ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం, AI152 ఫ్లైట్ సాంకేతిక లోపం కారణంగా రద్దు చేయబడింది. జ్యూరిచ్ లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్న కారణంగా విమానాన్ని రద్దు చేయబడింది అని ఎయిర్ ఇండియా ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికుల కోసం హోటల్ వసతి, ఫుల్ రీఫండ్, లేదా ఉచితంగా రీ-షెడ్యూలింగ్ లాంటి పరిష్కారాలను అందించినట్లు ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది.

Read more: https://teluguprabha.net/national-news/naveen-patnaik-admitted-to-hospital-in-bhubaneswar-condition-stable/

ప్రయాణికుల్లో ఒకరు ఇంజిన్ సమస్య వల్ల విమానం టేక్ ఆఫ్ ఆగిపోయింది” అంటూ సోషల్ మీడియా వేదిక X లో పోస్టు చేశారు. ఇటు దేశీయంగా కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అదే రోజు కొచ్చి నుండి ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానం టేక్ ఆఫ్ సమయంలో నిలిపివేయబడింది. ఆ విమానంలో కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ కూడా ప్రయాణిస్తున్నారు. ఆయన టేక్ ఆఫ్ సమయంలో విమానం రన్‌వేపై స్కిడ్ అయినట్టు అనిపించిందని చెబుతుండగా, అధికారులు మాత్రం ఇది ఒక సాధారణ సాంకేతిక లోపమే అని వివరణ ఇచ్చారు.

Read more: https://teluguprabha.net/national-news/pm-modi-meets-vice-presidential-candidate-cp-radhakrishnan-to-discusses-nda-strategy/

అప్పటికే టేక్ ఆఫ్ కు సిద్ధంగా ఉన్న విమానంలో లోపం గుర్తించిన వెంటనే, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే AI-171 విమానం కూడా టేక్ ఆఫ్ తరువాత ఇంజిన్ సమస్యలు తలెత్తిన ఘటన నేపథ్యంలో, ఎయిర్ ఇండియా CEO క్యాంప్‌బెల్ విల్సన్ విమానాలపై సమగ్ర తనిఖీలు చేసినట్లు ప్రకటించారు. వారు వెల్లడించిన ప్రకారం, బోయింగ్ 787-8 మరియు 787-9 విమానాలపై విస్తృత స్థాయిలో నిర్వహించిన పరిశీలనలలో ఎలాంటి లోపాలు లేవు అని తేలింది. కానీ ప్రస్తుత ఘటనలు ఆ భరోసాపై ప్రశ్నలు వేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad