Sunday, November 10, 2024
Homeనేషనల్Air India New Guidelines: జుట్టు ఎక్కువ ఊడేవాళ్లకు గుండు త‌ప్ప‌నిస‌రి.. ఎయిరిండియా కొత్త రూల్స్

Air India New Guidelines: జుట్టు ఎక్కువ ఊడేవాళ్లకు గుండు త‌ప్ప‌నిస‌రి.. ఎయిరిండియా కొత్త రూల్స్

Air India New Guidelines: టాటా యాజ‌మాన్యం చేతుల్లోకి వెళ్లిన త‌రువాత ఎయిరిండియా కొత్తరూపును సంత‌రించుకుంటోంది. ఆదాయ మార్గాల‌ను పెంచుకొని న‌ష్టాల‌ను భ‌ర్తీచేసే క్ర‌మంలో కొత్త‌కొత్త దారుల‌కు యాజ‌మాన్యం బాట‌లు వేస్తోంది. ముఖ్యంగా సంస్థ‌లో ప‌నిచేసే సిబ్బంది ప్ర‌తీఒక్క‌రూ ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌త‌ను ఇచ్చేలా కొత్త‌రూల్స్ అమ‌ల్లోకి తెచ్చింది. వీటిల్లో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే రూల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్ గా ప‌నిచేసే పురుష సిబ్బందిలో ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటే వారు క‌చ్చితంగా గుండు చేయించుకోవాల‌ని స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అంతేకాదు.. మ‌గ‌వారికి, ఆడ వారికి ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాల‌ను యాజ‌మాన్యం విడుద‌ల చేసింది. వీటిని క‌చ్చితంగా పాటించాల‌ని సిబ్బంది స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

మ‌హిళా సిబ్బంది విష‌యానికొస్తే.. వ‌స్త్ర‌ధార‌ణ‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలను ఎయిరిండియా రూపొందించింది. అయితే, పురుష సిబ్బంది కంటే మ‌హిళా సిబ్బందికే ఎక్కువ నిబంధ‌న‌లు ఉన్నాయి. మహిళా సిబ్బంది ముత్యాల చెవి రింగులు ధరించకూడదు. బంగారం లేదా డైమండ్ గుండ్రని చెవిపోగులు ధరించవచ్చు. అందులో ఎలాంటి డిజైన్ ఉండకూడదు. చీరతో పాటు బిందీని కలిగి ఉండటం ఐచ్ఛికం. బిందీ పరిమాణం 0.5 సెం.మీ కంటే ఎక్కువ ఉండకూడదు. మహిళా సిబ్బంది చేతికి ఒక కంకణాన్ని మాత్రమేధరించడానికి అనుమతినిచ్చారు. ఈ కంకణంలో ఎలాంటి డిజైన్ రాళ్లు ఉండకూడదు. వేళ్ళకు 1 సెం.మీ కంటే పెద్ద ఉంగరం ధరించడానికి అనుమతి లేదు.

ఒక చేతికి ఒక ఉంగరం మాత్రమే ధరించడానికి అనుమతినిచ్చారు. ఎయిరిండియా కొత్త రూల్స్‌లో డ్రెస్‌కోడ్‌, అన్నీ వివరంగా ఇచ్చారు. ఐషేడ్స్, లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, హెయిర్ షేడ్స్ కార్డుల నిబంధనలను అనుసరించి కచ్చితంగా పాటించాలి. డ్యూటీ సమయంలో చీర లేదా ఇండో-వెస్ట్రన్ డ్రెస్‌ ఏదైనా సరే చెప్పులు ధరించడం తప్పనిసరి. చెప్పులు రంగు చర్మం రంగుతో సరిపోలాలి. చేతి, మెడ లేదా చీలమండ చుట్టూ నలుపు లేదా మతపరమైన దారం ధరించడం కూడా నిషేధించబడింది.

ఇక ఎయిరిండియాలో ప‌నిచేసే మ‌గ సిబ్బంది విష‌యానికివ‌స్తే.. క‌చ్చితంగా వారి జుట్టుప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. హెయిర్ జెల్ వాడకం తప్పనిసరి. బట్ట తల ఉన్నవారు, జుట్టు అతిగా రాలుతుంటే తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రూ కట్ అనుమతించబడదు. ఇలా క్రూ కట్ తో డ్యూటీకి వస్తే క్యాబిన్ లోకి అనుమతించరు. జుట్టు తెల్లగా మారుతుంటే స్త్రీ, పురుష సిబ్బంది క్రమం తప్పకుండా రంగు వేసుకోవాలి. జుట్టుకు రంగు వేయడానికి ఫ్యాషన్ కలర్, గోరింటాకు వేయకూడదని ఎయిర్ ఇండియా నిబంధనలలో పేర్కొంది. అంతేకాదు చేతి, మెడ, చీలమండ చుట్టూ నలుపు లేదా మతపరమైన దారం ధరించడం కూడా నిషేధించబడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News