Homeనేషనల్Delhi Airport: రన్‌వే పై ఢీకొన్న విమానాలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదం

Delhi Airport: రన్‌వే పై ఢీకొన్న విమానాలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదం

Delhi Airport: ఢిల్లీ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో రన్‌వేపైకి వెళ్తున్న క్రమంలో ఆకాశ ఎయిర్ (Akasa Air), స్పైస్‌జెట్ (SpiceJet) విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. విమానాల కదలికలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక విమానం వింగ్‌, మరో విమానాన్ని తాకడంతో స్వల్ప నష్టం వాటిల్లింది.

- Advertisement -

ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానం (QP 1354) ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉండగా అదే సమయంలో స్పైస్‌జెట్ విమానం కూడా రన్‌వే వైపు వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, విమానాల వేగం చాలా తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు విమానాల్లోని ప్రయాణికులంత క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు.

విచారణకు ఆదేశం..
ఈ ఘటన కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రన్‌వేపై విమానాలు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్‌లో ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై విమానయాన నియంత్రణ సంస్థ (Directorate General of Civil Aviation) విచారణకు ఆదేశించినట్టు సమాచారం. పైలట్ల తప్పిదమా లేక గ్రౌండ్ స్టాఫ్ సిగ్నల్స్‌లో లోపమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ వంటి అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా ఏర్పాట్లపై ఆందోళన కలిగిస్తోంది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానాల వింగ్స్‌ విరగడంతో ప్రయాణికులను మరో విమానాల్లో పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

Also Read: Tamanna: తమన్నాకు షాక్‌.. ఆ పిటిషన్‌ను కొట్టేసిన మద్రాస్‌ హైకోర్టు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News