Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక ప్రకటన చేసింది. తన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు తెలిపింది. భారత దేశంలో హైస్కూల్ విద్యార్థుల కోసం ఈ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. అయితే.. ఎటువంటి కారణం చెప్పకుండానే మూసివేస్తున్నట్లు తెలిపింది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో గతేడాది అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాట్‌ఫాం వేదికగా జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే దీన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం ఉన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దశల వారీగా ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉండడంతో విద్యాసంస్థలు అన్ని యథావిధిగా పని చేస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ విద్యను అందిస్తున్న సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. 2500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు బైజూస్ చెప్పిన సంగతి తెలిసిందే.