Trump Wishes to PM Modi: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని ‘చారిత్రాత్మకం’, ‘నిర్ణయాత్మకం’ అని వైట్ హౌస్ అభివర్ణించింది. ఈ మేరకు మోదీ నాయకత్వాన్ని, ఈ విజయాన్ని ట్రంప్ అభినందించారని వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు.
‘నా స్నేహితుడు నరేంద్ర మోదీకి ఈ గొప్ప విజయం దక్కినందుకు అభినందనలు. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి తీర్పు రావడం ఆయన నాయకత్వానికి ప్రజలు ఇస్తున్న గౌరవం’ అని అభినందన సందేశంలో ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఈ విజయం కేవలం భారత్‌కే కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
ఈ అభినందనల పట్ల స్పందించిన మోదీ.. అమెరికాతో కలిసి ప్రపంచ అభివృద్ధి, శాంతి కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/famous-producer-rb-choudhary-passes-away-in-road-accident/
గత నెలలో రెండు విడతల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఫలితాలు వెలువడ్డాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు తెరదించుతూ, బీజేపీ మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు, ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ప్రధాని మోదీ ఢిల్లీలోని విజయోత్సవ సభలో వెల్లడించారు. ఇక అస్సాంలో వరుసగా మూడోసారి బీజేపీ విజయం సాధించడంపై అంతర్జాతీయ సమాజం ఆసక్తి చూపుతోంది.

