Amit Shah ‘Women Reservation Bill’: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఇండి కూటమి వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. మహిళలకు మేలు చేసే బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేసేలా ముందుకెళ్తున్నామని.. మహిళా సాధికారత దిశగా చేసే పనులకు ఎందుకు మద్దతివ్వడం లేదన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/meeting-on-kaleshwaram-project-at-telangana-bhavan-in-delhi/
‘బిల్లులపై సమగ్రంగా చర్చ జరిగింది. మహిళా బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదు. కేవలం ఇండి కూటమి సభ్యులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. మహిళా బిల్లుకు మద్దతిస్తామని చెబుతూనే.. కానీ.. అయితే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్ సెట్. విపక్షాలు వ్యతిరేకించింది మహిళా రిజర్వేషన్ బిల్లునే, డీలిమిటేషన్‌ను కాదు. 2029 ఎన్నికలకు 33 శాతం రిజర్వేషన్లతో వెళ్లాలని ప్రధాని మోదీ భావించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లకు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయి. 130 మంది ఎంపీలు, 56 మంది మహిళా ఎంపీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకించడం అంటే ఎస్సీ, ఎస్టీలను వ్యతిరేకించడమే. ఎస్సీ, ఎస్టీల సంఖ్య పెరిగినప్పుడు పార్లమెంట్‌లో వాళ్ల సీట్ల సంఖ్య కూడా పెరుగుతాయి.’ -అమిత్ షా
ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో తీవ్ర వ్యత్యాసం ఉందని అమిత్ షా అన్నారు. ఒకచోట 39 లక్షల ఓటర్లు ఉంటే.. మరోచోట 60 వేల ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. 1970లో లోక్ సభ సీట్లు పెరిగాయని.. ఆ తర్వాత పెంచలేదని గుర్తు చేశారు. జనాభా లెక్కలకు డీలిమిటేషన్‌కు లింకు పెట్టింది తాము కాదని.. కాంగ్రెస్ అని విమర్శించారు. ప్రతిపక్షం తమ మీద నమ్మకం ఉంచితే లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు.

