ప్రజాస్వామ్యం కాదు వారసత్వ రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయి అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. 2024లో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీకే పట్టం కట్టాలంటూ పిలుపునిచ్చారు అమిత్ షా. ఈమేరకు కౌశాంబి మహోత్సవ్ లో పాల్గొన్న ఆయన చేసిన మాటలు మరోమారు రాజకీయ మంటలు మండిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలను పదేపదే అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీల వైఖరిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని షా అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంతో విపక్షాలు ఇలా అత్యంత విలువైన పార్లమెంట్ సమయాన్ని వృథా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
- Advertisement -
ప్రజాస్వామ్యం ఏమాత్రం ప్రమాదంలో పడలేదని కానీ కులతత్వం, వారసత్వ రాజకీయాలు దేశాన్ని ప్రమాదంలో ముంచెత్తుతాయని అన్నారు.