Homeనేషనల్Amit Shah : తమిళ గడ్డపై అమిత్ షా 'పొంగల్' సందడి.. 1008 కుండలతో ఘన...

Amit Shah : తమిళ గడ్డపై అమిత్ షా ‘పొంగల్’ సందడి.. 1008 కుండలతో ఘన వేడుక!

Amit Shah Pongal celebrations : తమిళ గడ్డపై కమల వికాసమే లక్ష్యంగా, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర సంప్రదాయ పండుగ పొంగల్‌లో మమేకమయ్యారు. ప్రజలతో మమేకమయ్యే వ్యూహంలో భాగంగా, తిరుచ్చిలో బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన “నమ్మ ఊరు మోదీ పొంగల్” (మన ఊరి మోదీ పొంగల్) వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. 1008 కుండలతో పొంగలి వండిన ఈ భారీ కార్యక్రమం, ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  రెండు రోజుల తమిళనాడు పర్యటనలో భాగంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం తిరుచ్చిలోని మన్నార్పురంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -

1008 కుండలతో పొంగలి: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో, చెరకు గడలతో అలంకరించిన 1008 కొత్త కుండలలో, మహిళలు సంప్రదాయబద్ధంగా పొంగలి వండారు. వేడుకలకు విచ్చేసిన అమిత్ షా, పార్టీ సభ్యులతో కలిసి, స్వయంగా పొంగలి తయారీలో పాలుపంచుకున్నారు.

నమ్మ ఊరు మోదీ పొంగల్’: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో, బీజేపీ ఈ కార్యక్రమానికి “నమ్మ ఊరు మోదీ పొంగల్” అని పేరు పెట్టింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

ఆలయాల సందర్శన, పాదయాత్ర ముగింపు : ఈ పొంగల్ వేడుకలకు ముందు, అమిత్ షా తన పర్యటన ముగింపు రోజున పలు ఆధ్యాత్మిక, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుచ్చిలోని శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తిరువానైక్కావల్‌లోని శ్రీ జంబుకేశ్వర అఖిలాండేశ్వరి ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాదయాత్ర ముగింపు: ఆదివారం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ చేపట్టిన “తమిళగం తలై నిమిర తమిళనిన్ పయనం” (తమిళనాడు తలెత్తుకోవడానికి ఓ తమిళుడి యాత్ర) పాదయాత్ర ముగింపు సభలో పుదుక్కొట్టైలో పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా, అమిత్ షా ఒకవైపు తమిళ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే, మరోవైపు రాష్ట్రంలో బీజేపీ రాజకీయ పునాదులను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News