Homeనేషనల్Amit Shah: బెంగాల్‌ అభివృద్ది మా బాధ్యత.. హామీలన్నీ నెరవేరుస్తామన్న అమిత్‌ షా

Amit Shah: బెంగాల్‌ అభివృద్ది మా బాధ్యత.. హామీలన్నీ నెరవేరుస్తామన్న అమిత్‌ షా

Amit Shah Promises Bengal development: పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అభివృద్ది మా బాధ్యత అంటూ స్పష్టం చేశారు. మరోవైపు, బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌ ఐదు దశాబ్దాల పాటు ప్రజాస్వామ్య క్షీణత, శాంతిభద్రతల పతనంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొందని విమర్శించారు. టీఎంసీ ఓటమితో అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిందని తెలిపారు. తమ అభ్యర్థి సువేందు అధికారి మమతను ఆమె సొంత నియోజకవర్గంలోనే ఓడించారని గుర్తు చేశారు. తాము సాధించిన ఈ అసాధారణ విజయాన్ని బెంగాల్‌ ఎన్నికల చరిత్రలోనే కీలక మలుపుగా అభివర్ణించారు. ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ఇప్పుడు బీజేపీ పార్టీపై ఉందని.. ఇక బెంగాల్‌ అభివృద్ధి బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.

- Advertisement -

Also read: https://teluguprabha.net/national-news/vijay-swearing-in-as-cm-tomorrow/

కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి..

బెంగాల్‌లో శాంతియుతంగా పోలింగ్ నిర్వహించినందుకు ఎన్నికల సంఘం, భద్రతా దళాలు, రాష్ట్ర అధికారులను అమిత్‌ షా అభినందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరుస ఓటములు ఎదుర్కొంటోందని.. దీనిపై ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఆత్మపరిశీలన చేసుకోని నాయకులు ఎప్పటికీ నిజమైన విజయాన్ని సాధించలేరని పరోక్షంగా రాహుల్‌కు చురకలంటించారు. సువేందు నేతృత్వంలోని నూతన ప్రభుత్వం బెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, రేపే పశ్చిమ బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News