Monday, March 31, 2025
Homeనేషనల్Amit Shah: మరో ఏడాదిలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం: అమిత్ షా

Amit Shah: మరో ఏడాదిలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం: అమిత్ షా

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఎక్స్ వేదికగా స్పందించారు.

- Advertisement -

“సుక్మాలో జరిగిన ఆపరేషన్‌లో మన భద్రతా సంస్థలు 16 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయి. అలాగే భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మార్చి 31, 2026లోపు దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని నిశ్చయించుకున్నాము. ఆయుధాలు కలిగి ఉన్నవారికి నా విజ్ఞప్తి ఏమిటంటే.. ఆయుధాలు, హింస మాత్రమే మార్పును తీసుకురాలేవు. శాంతి మరియు అభివృద్ధి మాత్రమే చేయగలవు. అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News