Amit Shah Zoho Mail Switch : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక ఈమెయిల్ సేవలను గూగుల్‌కు చెందిన జీమెయిల్ నుంచి చెన్నై స్థాపిత స్వదేశీ సంస్థ జోహో మెయిల్‌కు మార్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపునిచ్చిన స్ఫూర్తితో, ఈ మార్పు దేశీయ సాంకేతికతలకు ప్రోత్సాహం అందిస్తుందని ఆయన చెప్పారు.
ఈ మార్పును అక్టోబర్ 8, 2025న X (ట్విటర్)లో ప్రకటించారు. “అందరికీ నమస్కారం. నేను జోహో మెయిల్‌కు మారాను. నా కొత్త ఈమెయిల్ చిరునామా: amitshah.bjp@zohomail.in. భవిష్యత్తులో ఈ చిరునామాను ఉపయోగించండి” అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయి, 1 మిలియన్ వ్యూస్ దాటింది.
ఈ మార్పు ప్రభుత్వ స్థాయిలో స్వదేశీ డిజిటల్ సూట్లకు మలుపు తిరిగింది. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ఈ విషయాన్ని స్వాగతించి, “భారతీయ ఇంజనీర్లకు గర్వకారణం” అని పోస్ట్ చేశారు. 1996లో చెన్నైలో స్థాపించిన జోహో, 80 మిలియన్ యూజర్లతో ప్రపంచంలో 3వ అతిపెద్ద SaaS కంపెనీ. ఇది మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు బదులు స్వదేశీ ఆప్షన్‌గా ప్రసిద్ధి.
కొద్ది రోజుల క్రితమే కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహో ఆఫీస్ సూట్‌కు మారారు. సెప్టెంబర్ 22, 2025న Xలో ప్రకటించి, “డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లకు జోహో బెస్ట్. స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లు స్వీకరించాలి” అని పిలుపునిచ్చారు. ఇది భారతీయ టెక్ స్వయం సమృద్ధికి మరో బూస్ట్.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా అధికారులందరినీ జోహో ఆఫీస్ సూట్ (రైటర్, షీట్, షో) వాడమని ఆదేశించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వర్క్‌స్పేస్‌కు బదులు ఈ స్వదేశీ టూల్స్ వాడాలని సర్క్యులర్ జారీ. NIC ద్వారా ట్రైనింగ్ అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ డేటా సెక్యూరిటీ, స్వయం సమృద్ధికి దోహదపడుతుంది.
ఇటీవల జోహో ‘అరట్టై’ మెసేజింగ్ యాప్ లాంచ్ చేసింది. వాట్సాప్‌కు సవాలుగా, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, ప్రైవసీ ఫోకస్‌తో ప్రపంపిస్తోంది. ఈ మార్పులు భారతీయ టెక్ కంపెనీలకు బలం. అమిత్ షా మార్పు ప్రభుత్వ స్థాయిలో స్వదేశీ టెక్ అడాప్షన్‌కు మైలురాయి. ప్రజలు కూడా జోహో వాడమని ఆయన పిలుపు.


