Sunday, July 7, 2024
Homeనేషనల్Anand Mahindra :'హే ఫిఫా అత‌డికి ఏదైనా ట్రోఫి ఇవ్వండి' : ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

Anand Mahindra :’హే ఫిఫా అత‌డికి ఏదైనా ట్రోఫి ఇవ్వండి’ : ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

Anand Mahindra : ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు సందేశాత్మ‌క‌, స్పూర్తిదాయ‌క విష‌యాల‌ను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. వైద్యులు ఆప‌రేష‌న్ చేస్తున్న స‌మ‌యంలో రోగి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చూస్తున్న ఫోటో అది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

పోలాండ్‌లో ఓ వ్య‌క్తికి స్పైనల్ అనస్తీషియా సర్జరీ నిర్వ‌హించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో రోగి వైద్యుడికి ఒక అభ్యర్థన చేసాడు. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ఓ టీవీని ఏర్పాటు చేయించాల‌ని, ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను చూస్తూ శ‌స్త్ర‌చికిత్స చేయించుకుంటాన‌ని చెప్పాడు. ఇందుకు అంగీక‌రించిన వారు టీవీని ఏర్పాటు చేశారు. ఇరాన్‌, వేల్స్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ను రోగి చూస్తుండ‌గా వైద్యులు స‌ర్జ‌రీ పూర్తి చేశారు. దీన్ని అక్క‌డి వైద్యులు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇది ఆనంద్ మ‌హీంద్రా కంట ప‌డింది.

దీని రీ ట్వీట్ చేస్తూ ఆనంద్ మ‌హీంద్రా ఇలా రాసుకొచ్చారు. “హే FIFA ఈ వ్య‌క్తికి ఏదైనా ట్రోఫి ఇవ్వాల‌ని మీకు అనిపించ‌లేదా” అని FIFAను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ వీడియోకు వేలల్లో లైక్ లు వ‌స్తున్నాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News