Anmol Bishnoi Arrest: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్‌మోల్ బిష్ణోయ్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. అమెరికాలో అదుపులోకి తీసుకున్న అతన్ని ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలోకి రాగానే అరెస్ట్ చేశారు. 2023 మార్చిలో NIA అన్‌మోల్‌పై ఛార్జ్‌షీట్ తెరిచింది. 2020–2023 మధ్యలో గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లకు పలు బెదిరింపులు, హత్యల్లో సహకరించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అతడి అన్న బిష్ణోయ్, అన్‌మోల్‌పై పంజాబ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.
ఇక అమ్‌మోల్ బిష్ణోయ్ అమెరికాలో అక్రమ పాస్‌పోర్ట్‌ని ఉపయోగించి చేరుకున్నట్టు నివేదికలో తేలింది. అక్కడి అధికారుల సహాయంతో అన్‌మోల్‌ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అరెస్టుతో అంతర్జాతీయంగా బిష్ణోయ్ ముఠా నెట్‌వర్క్ బలహీనపడిందని పోలీసులు భావిస్తున్నారు. దేశ-విదేశాల్లో ముఠా వార్‌లను ప్రోత్సాహించడం, ప్రత్యర్థి ముఠాలకు ప్రాణహాని తలబెట్టడం, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలోనే అతడిపై ప్రత్యర్థుల బెదిరింపులు పెరగడంతో అమెరికాలోనే అధికారులకు ముందు లొంగిపోయాడని సమాచారం. దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.
Also Read: Delhi Blast Hero: దిల్లీ బ్లాస్ట్ లో దొరికిన ధీరుడు.. స్నేహబంధం గొప్పదనం చాటిన రాహుల్!
ఇదే క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ అన్‌మోల్‌ని అదుపులోకి తీసుకుంది. అతని రిమాండ్ విచారణలో మరిన్ని అసాంఘిక కార్యక్రమాలపై వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఇదే క్రమంలో లారెన్స్ బిష్ణోయ్ ప్రత్యర్ధులుగా ఉన్న గ్యాంగ్‌స్టర్స్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ప్రభావం దేశ విదేశాల్లో పెరుగుతోంది. వీరి ఎక్కువమంది షూటర్లు కావడం.. దుబాయ్, కెనడా, అమెరికాలో వీళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై లోతుగా విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
దేశంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ గట్టి నిఘా కొనసాగుతోంది. ఉగ్ర కదలికలు మొదలుకొని గ్యాంగ్‌స్టర్స్ వంటి వారిపై ప్రత్యేక డేగ కన్ను వేస్తోంది. ఇదే క్రమంలో అన్‌మోల్‌ని అరెస్ట్ చేయడం అలాంటి వారికి వార్నింగ్ ఇచ్చినట్లే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

