Friday, April 4, 2025
Homeనేషనల్BJP: తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా

BJP: తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా

తమిళనాడు(Tamilnadu) రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నామలై(Annamalai) రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు నడ్డాకు(JP Nadda) పంపించారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

- Advertisement -

కాగా అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అన్నామలై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం పళని స్వామి బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిశారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పు వస్తుందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే అన్నామలై రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News