అమెరికా (America)లో చదువుకునేందుకు వెళ్లిన ఇండియన్స్ కి తిప్పలు తప్పటం లేదు. అక్కడ బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే వారిని గుర్తించిన అమెరికా ప్రభుత్వం వారి వారి దేశాలకు పంపుతున్న విషయం తెలిసిందే. వలసదారులను వెనక్కు పంపుతున్న అమెరికా ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత్ కు మరో రెండు విమానాలు రానున్నాయి.
ఈ నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లో అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారులు (Illegal immigrants) రానున్నారు. 119 మందితో మరో అమెరికా విమానం భారత్కు రానుంది. ఈ విమానంలో పంజాబ్, హర్యానా, గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
రాత్రి 10గంటలకు అమృత్సర్లో అమెరికా విమానం ల్యాండ్ కానుంది. రేపు మరో విమానం ల్యాండింగ్ కానుంది. కేంద్రం, పంజాబ్ సర్కార్ మధ్య మరింత ముదిరిన వివాదంతో కావాలనే విమానాలను అమృత్సర్లో దించుతున్నారని సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆరోపణలు చేశారు.
Flight: 119 మందితో నేడు భారత్కు రానున్న మరో అమెరికా విమానం
- Advertisement -