HomeTop StoriesUpendra Dwivedi: మళ్లీ అలా చేస్తే వరల్డ్‌ మ్యాప్‌లో కనిపించరు.. పాకిస్థాన్‌కి భారత ఆర్మీ చీఫ్‌...

Upendra Dwivedi: మళ్లీ అలా చేస్తే వరల్డ్‌ మ్యాప్‌లో కనిపించరు.. పాకిస్థాన్‌కి భారత ఆర్మీ చీఫ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

Army Chief Upendra Dwivedi warning to Pakistan: భారత్‌పై ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దాయాది పాకిస్తాన్‌కు భారత సైన్యాధిపతి (ఆర్మీ చీఫ్) ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తం పాకిస్తాన్‌ ప్రపంచ చిత్ర పటం నుంచి మాయమవ్వడం ఖాయమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఉపేంద్ర ద్వివేది ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ పరిస్థితులు మళ్లీ ఎదురైతే భారత సైన్యం ఎలా స్పందిస్తుందని విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.

- Advertisement -

Also Read: Kavitha: బండి సంజయ్‌ని వెంటనే బర్తరఫ్‌ చేయాలి.. పీఎం మోదీకి కవిత సంచలన లేఖ

ఆపరేషన్ సిందూర్‌కి ఏడాది పూర్తి..

గతేడాది మే 7వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. దీనికి ఆపరేషన్ సిందూర్ అనే పేరు పెట్టారు. ఈ చారిత్రాత్మక సైనిక చర్య జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, గతేడాది మే నెలలో ఇరు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటు సైనిక ఘర్షణ జరిగింది. పాకిస్తాన్ భారత్‌పై ఎదురుదాడికి చేయగా, భారత్ కూడా ఆపరేషన్ సిందూర్‌తో గట్టి సమాధానమిచ్చింది. చివరకు మే 10న ఇరు దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిన అనంతరం ఈ ఘర్షణలకు పులిస్టాప్‌ పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News