HomeTop StoriesPuri Jagannath Rath Yatra: పూరి జగన్నాథుడి రథయాత్రకు ఏర్పాట్లు పూర్తి.. సాయంత్రం 4 గంటలకు...

Puri Jagannath Rath Yatra: పూరి జగన్నాథుడి రథయాత్రకు ఏర్పాట్లు పూర్తి.. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం

Arrangements for the Puri Jagannath Rath Yatra are complete: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో శ్రీజగన్నాథస్వామి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. లక్షలాది భక్తుల నడుమ రేపు (గురువారం) రథయాత్ర జరగనుండగా.. దేవస్థానం, ఒడిశా ప్రభుత్వం అత్యంత భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశాయి. బలభద్రుడి రథం తాళధ్వజం, దేవి సుభద్ర రథం దర్పదళనం, జగన్నాథుడి రథం నందిఘోషను సర్వాంగ సుందరంగా అలకరించారు. పూరి శంకరాచార్య స్వామి, నిశ్చలానంద సరస్వతి సందర్శన, గజపతి మహారాజు రథాన్ని ఊడ్చే సంప్రదాయ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు పూరీ రథయాత్ర ప్రారంభం కానుంది.

- Advertisement -

Also read: Musi River: మూసీ నదిలో గుర్రపు డెక్క.. దోమలపై డ్రోన్ అస్త్రం.. జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News