Sunday, November 16, 2025
Homeనేషనల్Artificial Rain: కృత్రిమ వర్షానికి ఢిల్లీ సిద్ధం.. క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియ వీడియో..

Artificial Rain: కృత్రిమ వర్షానికి ఢిల్లీ సిద్ధం.. క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియ వీడియో..

Artificial rain in Delhi Cloud Seeding: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో సాధారణ పరిస్థితుల్లోనే వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. ఇక, దీపావళి సందర్భంగా అక్కడ రికార్డు స్థాయిలో వాయి కాలుష్యం నమోదవుతుంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం.. కొన్ని రోజులు రోడ్లపై వాహనాల నియంత్రణ పాటిస్తుంది. ఇక, ఈ సారి వాయి కాలుష్యాన్ని అరికట్టేందుకు అక్కడ కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియను పూర్తి చేసింది. 

- Advertisement -

ఢిల్లీలో మంగళవారం వాయు నాణ్యత సూచి (AQI) 306 గా రికార్డు అయినట్లు కేంద్ర కాలుష్య  నియంత్రణ బోర్డు (CPCB) తెలిపింది. వర్షం కురిసినప్పుడు వాయు కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంది. అయితే ఈ వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు వర్షం ఒక్కటే మార్గమని భావించిన ఢిల్లీ ప్రభుత్వం.. గతంలోనే కేబినెట్‌తో కలిసి ఆమోదం తెలిపింది. తాజాగా అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. నగరంలోని అయిదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

Also Read: https://teluguprabha.net/national-news/union-cabinet-approves-the-terms-of-reference-for-the-8th-pay-commission/

తాజాగా ఐఐటీ కాన్పూర్ నుంచి వచ్చిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌.. పొటాషియం అయోడైడ్‌, సిల్వర్‌ అయోడైడ్‌ లాంటి రసాయన ఉత్ర్పేరకాలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో మేఘాలపై చల్లింది. దీంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ పూర్తయినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో అక్కడ వర్షం పడే అవకాశాలున్నట్లు సమాచారం.

ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందంలో భాగంగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఏ సమయంలోనైనా ట్రయల్స్‌ నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్  (DGCA) అనుమతి ఇచ్చింది. ఇక, కృత్రిమ వర్షం కోసం కావాల్సిన రూ. 3.21 కోట్ల బడ్జెట్‌ను కూడా ఈ ఏడాది మేలో ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. 

Also Read: https://teluguprabha.net/national-news/prashanth-kishore-has-two-votes-in-bihar/

సాధారణంగా మేఘాలలో కావాల్సినంత తేమ ఉన్నా.. వర్షం పడేందుకు అన్నివేళలా అనుకూల పరిస్థితులు ఉండవు. ఈ కారణంగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ముందుగా శాస్త్రవేత్తలు అనువైన మేఘాలను గుర్తించి.. వాటిపై పొటాషియం అయోడైడ్, సిల్వర్ అయోడైడ్ లాంటి రసాయన ఉత్ర్పేరకాలను చల్లుతారు. దీన్నే క్లౌడ్ సీడింగ్ ప్రక్రియగా పిలుస్తారు. ఇది మేఘాల్లో తేమను కరిగించి వర్షం కురిసేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పొడిమంచును సైతం ఉపయోగిస్తారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad