Goa Governor: గోవా రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించారు. గోవా రాష్ట్ర గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్‌లో రేపు ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రమాణ స్వీకారం కోసం కుటుంబ సమేతంగా గోవా రాష్ట్రానికి అశోక్ గజపతిరాజు బయలుదేరి వెళ్ళారు.
గోవా రాష్ట్ర గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు తెదేపా ఎంపీలు హాజరు కానున్నారని సమాచారం. విశాఖ పట్నం నుండి హైదరాబాద్ కు, హైదరాబాద్ నుండి గోవాకు అశోక్ గజపతి రాజు వెళ్లనున్నారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న అశోక్ గజపతి రాజును పలువురు నేతలు అభినందించారు.
Readmore: https://teluguprabha.net/national-news/amarnath-yatra-more-than-3-52-lakh-people-visited-in-21-days/
ఆశోక్ గజపతిరాజు గజపతి రాజు దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆశోక్ గజపతిరాజు ప్రారంభంలో తెలుగు దేశం పార్టీలో చేరి, పార్టీలో ప్రధాన నాయకుడిగా ఎదిగారు. 2014లో ప్రయాణాల మంత్రిగా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడంలో చాలా కీలకపాత్ర పోషించారు.
విజయనగరంలో పోలీస్, నేవీ అధికారులు గోవా రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయబోయే పూసపాటి అశోక్ గజపతి రాజుకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కుటుంబం, అభిమానుల సమేతంగా గోవా రాష్ట్రానికి బయలుదేరారు.


