బాల్య వివాహాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినాతి కఠినంగా అవలంభిస్తున్నట్టు అస్సాం సీఎం ఈరోజు మరోమారు స్పష్టంచేశారు. 15 రోజుల వ్యవధిలోనే 4,000కు పైగా బాల్య వివాహాలు రాష్ట్రంలో జరిగాయన్న సమాచారంపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అస్సాం సీఎం ట్వీట్ చేశారు. 14 ఏళ్ల లోపు అమ్మాయిలను వివాహం చేసుకున్న వ్యక్తులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్టు అస్సాం కేబినెట్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. 14-18 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకున్న వారిపై బాల్య వివాహ నిషేధ చట్టం 2006 కింద కేసులు నమోదు చేయనున్నారు. అయితే కుల మతాలకు అతీతంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించినట్టు హిమంత పేర్కొన్నారు. అయితే ఇలాంటి బాల్య వివాహాల తంతు జరిపించే పూజారులు, మతపెద్దలపై కూడా చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలు, నవజాత శిశు మరణాలు అత్యధికంగా ఉన్నాయి. బాల్య వివాహాల కారణంగా నవజాత శిశు మరణాలు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి.
Assam: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటే పోక్సో కేసులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES