ర్యాగింగ్ కల్చర్.. ఓ విద్యార్థి ప్రాణాలమీదికి తెచ్చింది. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కు భయపడిన ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అసోంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీలో జరిగిందీ ఘటన. సీనియర్ల ర్యాగింగ్ కు భయపడిన ఆనంద్ శర్మ..వారి నుండి తప్పించుకునేందుకు హాస్టల్ రెండో అంతస్తు నుండి దూకి తీవ్రగాయాలపాలయ్యాడు. హాస్టల్ సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
ఆనంద్ శర్మకు వైద్యం చేసిన డాక్టర్లు.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఆనంద్ శర్మ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆనంద్ ను ర్యాగింగ్ చేసినట్టుగా అనుమానిస్తూ.. ఐదుగురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాలేజీలో ఉన్న సీనియర్లు తన కొడుకుని నాలుగు నెలలుగా మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఉన్నారని, తన కొడుకు వద్దనున్న డబ్బులు, మొబైల్ లాక్కొని హింసించేవారని, మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారని ఆరోపించారు.
ర్యాగింగ్ కారణంగా తన కుమారుడికి కాలు విరిగి, ఛాతీపై గాయమైందని, తమకు న్యాయం చేయాలని కోకారు. ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. నిందితులు ఎవరైనా వదిలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు ర్యాగింగ్ దూరంగా ఉండాలని కోరారు. కాగా.. ర్యాగింగ్ పై ఆనంద్ శర్మ యూనివర్సిటీ హాస్టల్ అధికారులకు ఈ నెల 17న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.