యూనివర్సిటీలలో అధ్యాపక ఖాళీల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్ లలో బిల్లును ఆమోదించిన విధానాన్నే… బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర విధానానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆమోదం లభిస్తోందని, కానీ రాష్ట్ర గవర్నర్ కు మాత్రం ఈ విధానం ఎందుకు అర్థం కావడం లేదు అని వినోద్ కుమార్ విస్మయాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేయాలన్న విధానాన్ని బిజెపి పాలిత రాష్ట్రమైన అస్సాంలో అమలు చేయాలని అస్సాం రాష్ట్ర క్యాబినెట్ తాజాగా గురువారం నిర్ణయం తీసుకున్నదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ విధానం చాలా గొప్పదని, ఈ విషయం జాతీయ స్థాయిలో నిరూపితం అవుతోందని వినోద్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీలలో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ లలో బిల్లును ఆమోదించి ఈ దస్త్రాన్ని రాష్ట్ర గవర్నర్ వద్దకు పంపగా, ఈ బిల్లును ఆమోదించకుండా గవర్నర్ గత ఆరు నెలలుగా తన కార్యాలయంలో అట్టి పెట్టారని వినోద్ కుమార్ అన్నారు.
జాతీయ స్థాయిలో ఆమోదం పొందిన తెలంగాణ ప్రభుత్వ యూనివర్శిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు విధానాన్ని గమనించి రాష్ట్ర గవర్నర్ ఇప్పటికైనా యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును ఆమోదం తెలపాలని, తద్వారా యూనివర్శిటీలలో దాదాపు రెండు వేల అధ్యాపక పోస్టుల భర్తీ అవుతాయని వినోద్ కుమార్ అన్నారు.
Hyd: మనల్ని అస్సాం కాపీ చేస్తున్నా మన గవర్నర్ కు విషయం అర్థం కావటం లేదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES