Monday, December 9, 2024
Homeనేషనల్ED Officials | ఢిల్లీలో ఈడీ అధికారులపై అటాక్

ED Officials | ఢిల్లీలో ఈడీ అధికారులపై అటాక్

ED Officials | ఢిల్లీలో ఈడీ అధికారులకు ఊహించని పరిణామం ఎదురైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు అధికారులపై అటాక్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని బిజ్వాసన్‌ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఈడీ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.

- Advertisement -

ఈడీ (ED) లోని హై- ఇంటెన్సిటీ యూనిట్‌ (HIU) అధికారులు దేశ వ్యాప్తంగా సైబర్‌ క్రైమ్ నెట్‌ వర్క్‌తో ముడిపడి ఉన్న ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ లక్ష్యంగా రైడ్స్ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బిజ్వాసన్‌ ప్రాంతం లోని ఓ ఫామ్‌ హౌస్‌లో సోదాలు నిర్వహిస్తుండగా.. ఐదుగురు దుండగులు ఫర్నీచర్‌తో ఈడీ అధికారుల (ED Officials) పై భౌతిక దాడికి దిగారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఈడీ అదనపు డైరెక్టర్‌కు గాయలయ్యాయి. దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, క్యూఆర్‌ కోడ్‌, షిప్పింగ్, పార్ట్‌ టైమ్‌ జాబ్స్ వంటి స్కామ్‌లతో సహా వేలాది సైబర్‌ క్రైమ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధులను వెలికితీసేందుకు ఈ సోదాలు నిర్వహిస్తునట్లు ఈడీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News