Saturday, November 15, 2025
Homeనేషనల్West Bengal MP: వరద బాధితులకు బీజేపీ నేతల సాయం, అంతలోనే ఎంపీపై రాళ్ల దాడి.. 

West Bengal MP: వరద బాధితులకు బీజేపీ నేతల సాయం, అంతలోనే ఎంపీపై రాళ్ల దాడి.. 

Attack On West Bengal BJP MP: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎంపీపై రాళ్ల దాడి తీవ్ర కలకలం రేపింది. పార్టీ నేతల బృందం వరద ప్రభావిత ప్రాంతాన్ని పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనతో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. 

- Advertisement -

వెస్ట్‌ బెంగాల్‌లోని నార్త్‌ మాల్దా నియోజకవర్గం బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ముపై సోమవారం రాళ్ల దాడి జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జల్‌పాయీగూడీలో బీజేపీ ప్రతినిధుల బృందం వరద ప్రభావిత ప్రాంతాన్ని పర్యటిస్తూ బాధితులకు సహాయసామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఎంపీ ఖగెన్ ముర్ముతో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

Also Read: https://teluguprabha.net/national-news/bihar-elections-from-november-8/

కాగా, దాడికి ముందు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ప్రతినిధులు పర్యటించకుండా 500 మందికిపైగా స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ‘గో బ్యాక్’ నినాదాలతో నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడిలో ఎంపీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

దాడి ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో తృణమూల్‌ ఆటవిక రాజ్యం నడుస్తోందంటూ పార్టీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్టు విమర్శించారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడటంతో ప్రభావిత ప్రాంతంలోని బాధితులను పరామర్శించేందుకు ఎంపీ వెళ్తుండగా టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడటం సరైన చర్య కాదన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం వరద బాధితులకు తగిన సాయం అందించడంలో విఫలమైందని ఆరోపించారు.

Also Read: https://teluguprabha.net/national-news/public-holiday-on-valmiki-jayanthi/

కాగా రాష్ట్రంలో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో దాడి ఘటనతో అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ వేడి చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad