Atul Subhash: భార్య వేధింపులు తట్టుకోలేక టెకీ అతుల్ సుభాష్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతుల్ భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను ప్రయాగ్‌రాజ్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు.
కాగా భార్య తనను తీవ్రంగా వేధిస్తుందింటూ అతుల్ బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకొనే ముదు దాదాపు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించారు. అంతేకాదు ప్రస్తుతం భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి 40 పేజీల లేఖ రాశారు. ఈ లేఖను ఇ-మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కుటుంబసభ్యులకు పంపించారు. అనంతరం తన నివాసంలో ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన ఒక కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పని చేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఉంటున్నారు.
ఆయన సోదరుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం బెంగళూరు పోలీసులు జౌన్‌పూర్‌లోని నికితా సింఘానియా ఇంటికి నోటీసులు అంటించారు. మూడు రోజుల్లోగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిచారు.