Saturday, November 15, 2025
Homeనేషనల్Social Media: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.....

Social Media: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. !

Social media ban in Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియా వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ భద్రతను నిర్ధారించడానికి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని పూర్తిగా నిషేధించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి చారిత్రక చట్టంగా నిలువనుంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఈ నిబంధన 2025 డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు మైనర్లు Facebook, Instagram, TikTok, Snapchat, X , YouTube, Reddit, Kick వంటి సోషల్ మీడియా అకౌంట్స్ వాడటం చట్టవిరుద్ధం అవుతుంది.

- Advertisement -

పూర్తి బాధ్యత కంపెనీలదే: సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే దుష్ప్రభావాల నుంచి పిల్లలను రక్షించడానికి ఈ చట్టం రూపొందించినట్టుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. మొదట్లో మినహాయింపు ఇవ్వాలని భావించినా.. పరిశోధనల తర్వాత యూట్యూబ్‌ను కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా ఆయా సోషల్ మీడియా కంపెనీలదేనని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మద్దతు ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని: 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్‌ మీడియాలో అకౌంట్‌లు క్రియేట్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఒకవేళ రూల్స్ పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ. 410 కోట్లు) వరకు జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి ఆందోళన చెందుతున్న అనేక దేశాలు (డెన్మార్క్, కొన్ని US రాష్ట్రాలు వంటివి) ఆస్ట్రేలియా చట్టాన్ని గమనిస్తున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆస్ట్రేలియా చేసిన చట్టానికి మద్దతు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad