Saturday, November 15, 2025
Homeనేషనల్Surya Tilak: శ్రీరామనవమి రోజు సూర్య తిలకానికి సిద్ధమైన బాలరాముడు

Surya Tilak: శ్రీరామనవమి రోజు సూర్య తిలకానికి సిద్ధమైన బాలరాముడు

శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతోంది. రామ మందిరాన్ని(Ayodhya Ram Temple) ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. నవమి సందర్భంగా ఆలయంలో బాల రాముడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటి(Surya Tilak)పై పడనున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు అయోధ్య ట్రస్ట్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

కాగా ఏటా శ్రీరామనవమి రోజున బాలరాముడి విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. ఆలయం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad