Thursday, July 4, 2024
Homeనేషనల్Ayodhya Mosque : అయోధ్య మసీదు డిజైన్.. అదిరిందిగా !

Ayodhya Mosque : అయోధ్య మసీదు డిజైన్.. అదిరిందిగా !

అయోధ్యలో అధునాతన మసీదు నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. 2019లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని నిర్మించేందుకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు రామలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. ఆ తీర్పు సమయంలోనే.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలన్న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు.. మసీదు నిర్మాణానికి స్థల కేటాయింపు జరిగింది. అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కన, దన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం ప్రారంభం కానుంది.

- Advertisement -

ఎంతో కాలంగా మసీదు నిర్మాణానికి ఆ స్థలాన్ని వినియోగించుకునేందుకు ఎదురుచూస్తుండగా, ఎట్టకేలకు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ నుంచి అనుమతి వచ్చినట్టు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ ప్రకటించారు. కాగా.. తాము కేవలం మసీదు ఒక్కటే కాకుండా, 200 పడకల హాస్పిటల్ కూడా నిర్మిస్తామని హుస్సేన్ తెలిపారు. మొదటి దశలో రూ.100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు వెచ్చిస్తామన్నారు. తాజాగా మసీదు నిర్మాణానికి సంబంధించిన ఊహాచిత్రాన్ని విడుదల చేయగా.. చూసేందుకు అద్భుతంగా ఉంది. ఉన్నది ఉన్నట్టు నిర్మిస్తే.. ఇంకెంత అందంగా ఉంటుందో కదా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News