బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ చాలా మంది బ్యాంకుకి వెళ్తుంటారు. లోన్లు, డబ్బులు దాచుకోవడానికి బ్యాంకుకి వెళ్లక తప్పదు. అయితే బ్యాంకు పనుల కోసం వెళ్లే వారికి బిగ్ అలర్ట్.
దేశాన్ని బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయని మనకి తెలుసు. అయితే గత కొంతకాలంగా దేశంలోని అన్ని బ్యాంకు సంఘాలు ఒకే నినాదంతో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నాయి. అదేంటంటే వారానికి 5 రోజుల పని దినాలను కల్పించాలని, తమకి తీవ్ర ఒత్తిడి అవుతుందని ప్రభుత్వాలను సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు బ్యాంకు ఉద్యోగులు.
అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగానూ తమకి ఎలాంటి హామీలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 25 లక్షల రూపాయల జీతం వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా తమకి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించాలని, అలాగే DFS రివ్యూలను తొలగించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి గత కొంత కాలంగా ఎలాంటి స్పందన లేదు.
దీంతో బ్యాంకులు ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 9 యూనియన్స్ ఒకసారి సమ్మెకు పిలుపునిచ్చాయి. తమకి పక్కాగా వారానికి 5 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. దేశంలోని బ్యాంకు ఉద్యోగులు అంతా ఈ 9 యూనియన్స్‌లో ఉంటారు. కాబట్టి వీరి నిర్ణయంతో మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చాయి. అయితే ప్రభుత్వం దీనిపై చర్చలు జరిపితే ఆందోళన విరమించుకోవచ్చు.. లేకపోతే ఆ రెండు రోజులు ఆందోళనలు కొనసాగుతాయి. మరి కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.