Homeనేషనల్Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. జనవరిలో సెలవులే సెలవులు.. వీటికి ముందే ప్లాన్‌...

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. జనవరిలో సెలవులే సెలవులు.. వీటికి ముందే ప్లాన్‌ చేసుకోండి..!

Bank Holidays in January Month: 2025 దాదాపు ముగింపునకు చేరుకున్నాం. నూతన ఏడాది 2026కి అడుగుపెట్టబోతున్నాం. ఈ తరుణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సెలవుల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితా ప్రకారం, జనవరి నెలలో వరుసగా జాతీయ పండుగలు, ప్రాంతీయ పండుగులు రానున్నాయి. దీంతో, జనవరిలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం, ప్రతి నెలలో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటికి అదనంగా ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే ప్రాంతీయ పండుగలు కలిపి జనవరిలో సెలవుల జాబితా కాస్త పెద్దగానే ఉంది. ఆయా రాష్ట్రాన్ని బట్టి బ్యాంకులకు సెలవులు అమల్లో ఉంటాయి. ఏ ఏ రోజున సెలవులు ఉంటాయో తెలుసుకుందాం.

- Advertisement -

మొత్తం 15 రోజుల పాటు సెలవులు..

జనవరి 1న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత జనవరి 6న సిక్కుల పదవ గురువు గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జనవరి 11 ఆదివారం కావడంతో మిజోరంలో మిషనరీ డే వేడుకలు జరగనున్నాయి. ఇక, పశ్చిమ బెంగాల్‌లో జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి, పొంగల్ పండుగల సందడి జనవరి 13 నుంచి 15 వరకు ఉంటుంది. లోహ్రి, సంక్రాంతి, పొంగల్, భోగి సందర్భంగా తమిళనాడు, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు అమల్లో ఉండగా.. ఆ వెంటనే జనవరి 24 నాలుగో శనివారం వస్తుంది.

బ్యాంకు పనులను ముందే ప్లాన్‌ చేసుకోండి..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూసి ఉంటాయి. శని, ఆదివారాలతో కలిపి మూడు రోజుల పాటు హాలిడే వీకెండ్ వస్తుంది. వరుస బ్యాంకు సెలవుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్లాన్‌ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు కస్టమర్లకు సూచిస్తున్నారు. ఏటీఎంలు అందుబాటులో ఉన్నప్పటికీ.. పెద్ద మొత్తంలో లావాదేవీలు లేదా చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు ఉన్నవారు ఈ సెలవులను గమనించి ముందే అందుకు తగ్గట్లు ప్లాన్‌ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News