IPS Officer Harcharan Singh Bhullar Caught For Bribery: పంజాబ్‌లోని రూప్‌నగర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG) గా పనిచేస్తున్న సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి హర్‌చరణ్ సింగ్ భుల్లర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అవినీతి కేసులో అరెస్టు చేసింది. కేవలం రూ.8 లక్షల లంచం డిమాండ్‌తో మొదలైన ఈ కేసులో, అతనికి సంబంధించిన ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో లెక్కల్లో చూపని భారీ సంపద బయటపడింది.
ALSO READ: BIHAR POLITICS: బిహార్‌లో పొత్తుల పంచాయితీ.. లాలూకు రాహుల్ ఫోన్! కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు!
2009-బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి భుల్లర్‌తో పాటు, అతని మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. స్థానిక వ్యాపారవేత్తపై నమోదైన క్రిమినల్ కేసును “సెటిల్” చేయడానికి ఈ అధికారి లంచం డిమాండ్ చేసినట్లు తేలింది.
సీబీఐ ఉచ్చు, లెక్కకు మించిన సంపద
ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన స్క్రాప్ డీలర్ ఆకాష్ బట్టా అనే ఫిర్యాదుదారు, తన వ్యాపారంపై తప్పుడు కేసు పెడతానని భుల్లర్ బెదిరించారని, సెటిల్‌మెంట్ కోసం ప్రారంభంలో రూ.8 లక్షలు, ఆ తర్వాత నెలవారీ చెల్లింపులు డిమాండ్ చేశారని సీబీఐకి ఫిర్యాదు చేశారు.
సీబీఐ ట్రాప్ చేసి, మధ్యవర్తి కృష్ణ రూ.8 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం భుల్లర్ కార్యాలయంలో అతనిని అరెస్టు చేశారు.
ALSO READ: DEFENSE MILESTONE: 32,000 అడుగుల నుంచి ఫ్రీ-ఫాల్ జంప్.. డీఆర్‌డీఓపై రాజ్ నాథ్ ప్రశంసలు!
అరెస్టు తర్వాత భుల్లర్‌కు సంబంధించిన అనేక ప్రాంగణాల్లో జరిపిన విస్తృత సోదాల్లో దొరికినవాటిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు:
- ₹5 కోట్లకు పైగా నగదు (లెక్కింపు ఇంకా కొనసాగుతోంది)
- 1.5 కిలోల బంగారం, ఆభరణాలు
- మెర్సిడెస్, ఆడి సహా రెండు లగ్జరీ వాహనాల తాళాలు
- 22 హై-ఎండ్ రిస్ట్‌వాచ్‌లు
- పంజాబ్‌లోని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, లాకర్ కీలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి.
మధ్యవర్తి కృష్ణ నివాసం నుంచి కూడా అదనంగా రూ.21 లక్షల నగదు రికవరీ అయింది. ఈ భారీ అక్రమాస్తులపై మరిన్ని దర్యాప్తు కొనసాగుతున్నాయి. మాజీ పంజాబ్ డీజీపీ ఎంఎస్ భుల్లర్ కుమారుడే ఈ హర్‌చరణ్ సింగ్ భుల్లర్ కావడం గమనార్హం.
ALSO READ: CASTE SURVEY: కులగణన సర్వేకు నారాయణమూర్తి దంపతుల ‘నో’! “మేం వెనుకబడిన వారం కాదు”


