పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ (CV Anandabose) అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను హుటాహుటిన కోల్కతాలోని కమాండ్ ఆస్పత్రికి తరలించామన్నారు. గవర్నర్కు ప్రాథమిక పరీక్షలు చేశామని ఆయన గుండెలో బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆస్పత్రికి వెళ్లి గవర్నర్ను పరామర్శించరు. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఆదేశించానని మమత చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను కమాండ్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆమె తెలిపారు.