Thursday, January 30, 2025
Homeనేషనల్Jayalalithaa: జయలలిత ఆస్తులపై కోర్టు సంచలన తీర్పు.. ఆ ఆస్తులు ఎవరివంటే..?

Jayalalithaa: జయలలిత ఆస్తులపై కోర్టు సంచలన తీర్పు.. ఆ ఆస్తులు ఎవరివంటే..?

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) ఆస్తులకు సంబంధించి బెంగళూరులోని (Bengaluru) ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2004 ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న వాటిని తమిళనాడు (TamilNadu) ప్రభుత్వానికి ఇచ్చేయాలని అధికారులను ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ కోట్లాది రూపాయలుగా తెలుస్తోంది. ఆ ఆస్తుల్లో చెన్నైలోని పోయెస్ గార్డెన్ నివాసం, బ్యాంకు డిపాజిట్లు, 700 కిలోల వెండి ఆభరణాలతో పాటు బంగారం (gold), వజ్రం, ముత్యాలు, ఇతర విలువైన ఆభరణాలు ఉన్నాయి. అలాగే 11,000కు పైగా చీరలు, 44 ఎయిర్ కండిషనర్లు, 750 ప్రత్యేక చెప్పులు, అనేక ఇతర వస్తువులు ఉన్నాయి.

- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. జయలలితకు చెందిన జప్తు చేసిన ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. జయలలిత మేనకోడలు జె. దీప, మేనల్లుడు జె.దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 13న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. అనంతరం ఈ నిర్ణయం వెలువడించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినందుకు జయలలితను కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసింది. అయితే 2016లో జయలలిత మరణం తర్వాత ఆమెపై విచారణ నిలిపివేశారు. కానీ ఆస్తుల జప్తును మాత్రం సుప్రీంకోర్టు సమర్థించింది.

మరోవైపు జయలలితపై కేసు కొట్టివేయడంతో.. ఆమె ఆస్తులను జప్తు చేయకూడదంటూ.. జయలలిత మేనకోడలు జె. దీప, మేనల్లుడు జె.దీపక్ కోర్టును ఆశ్రయించారు. 2023 జూలైలో సీబీఐ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో వారు హైకోర్టులో అప్పీల్‌ చేశారు. మరోవైపు 2024 ఫిబ్రవరిలో సీబీఐ కోర్టు అదే సంవత్సరం మార్చి నాటికి ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని భావించినా.. దీప, దీపక్ లు మాత్రం కర్ణాటక హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే జనవరి 13న హైకోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రత్యేక కోర్టు ఇతర నిందితులను దోషిగా నిర్ధారించింది. దీంతో ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది.

మరోవైపు పేదలకు సేవ చేయడానికి జయలలిత పేరు మీద ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని కూడా హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హెచ్.ఏ. మోహన్.. అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి జయలలిత నుంచి జప్తు చేసిన అన్ని విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News