Saturday, November 15, 2025
HomeTop StoriesBengaluru jail scandal: బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీల జల్సాల వీడియో లీక్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై...

Bengaluru jail scandal: బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీల జల్సాల వీడియో లీక్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

Karnataka prison videos: బెంగళూరు నగరంలోని పారప్పన అగ్రహార, సెంట్రల్ జైళ్లలో మళ్లీ వార్తల్లో సంచలనంగా నిలిచాయి. తాజాగా జైలులో ఖైదీల పార్టీలు, జల్సా డాన్సులకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం వివాదానికి గురైంది. సదరు వీడియోల్లో ఖైదీలు మద్యం సేవిస్తూ, మొబైల్ ఫోన్లతో వీడియోలు తీసుకుంటూ.. జైల్లో పార్టీలను నిర్వహిస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. దీనిపై ప్రజల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. శిక్షలో భాగంగా జైలు కెళ్లిన నేరగాళ్లు పార్టీలు చేసుకుంటూ వీడియోలు తీసుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనం.

- Advertisement -

బయటకొచ్చిన వీడియోల్లో నేరగాళ్లకు అందుతున్న సౌకర్యాలు.. కరుడుగట్టిన నేరగాళ్లుగా పేరొందిన చాలా మంది కనిపించారు. వారిలో మహిళలపై దాడులు, అత్యాచారాలు చేసిన ఉమేష్ రెడ్డి, ఇస్లామిక్ స్టేట్ రిక్రూటర్ జుహాద్ షకీల్ హమీద్, అలాగే బంగారు స్మగ్లింగ్ కేసులో నిందితులు కూడా ఉన్నారు. వీరందరికీ జైలులో అక్రమంగా మొబైల్ ఫోన్లు, మద్యం, స్పెషల్ సౌకర్యాలు లభిస్తున్నట్లు వీడియోలు స్పష్టంగా బయటపెట్టాయి. డబ్బుంటే ఖైదీ అయినా కింగ్ లాగా బతకొచ్చని ఇది మరోసారి నిరూపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియోలు బయటపడటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతలు దీనిని ప్యాటర్న్ ఆఫ్ ప్రివిలేజ్ అని వ్యాఖ్యానిస్తూ.. ఇది కేవలం ఒకే ఘటన కాదని, కర్ణాటక జైళ్లలో విస్తృతంగా జరుగుతున్న అవినీతి అని ఆరోపిస్తున్నారు. పైగా ఇలాంటి కార్యక్రమాలకు రాజకీయ మద్దతుగా నిలుస్తుండటంతో వ్యవస్థ పూర్తిగా విఫలమైందని అంటున్నారు. హోం మినిస్టర్ జి. పరమేశ్వర్ ఇప్పటికే విచారణ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ.. ప్రజలు, ప్రతిపక్షం ఇప్పుడు కేవలం కమిటీలు, నివేదికలతో కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, హోంమంత్రి పరమేశ్వర్ రాజకీయ పర్యవేక్షణలోనే ఇదంతా కొనసాగుతోందంటున్నాయి ప్రతిపక్షాలు.

జైల్లో ఉన్న సిబ్బందిలో కొంతమంది కూడా నిందితులతో కలసి సౌకర్యాలు కల్పిస్తున్నారనే అనుమానాలు తలెత్తాయి. అధికారులు ఈ వీడియోల నిజానిజాలు పరిశీలించేందుకు అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రజల భద్రత కోసం చట్టాన్ని కఠినతరం చేస్తామని ప్రభుత్వం చెబుతూనే.. మరోవైపు జైల్లో భయంకర నేరస్థులకు ‘వివిఐపీ సదుపాయాలు’ అందించడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad