Saturday, November 15, 2025
Homeనేషనల్Bengaluru CFO Bribes : “లంచాలు ఇచ్చి విసిగిపోయాను” – కూతురు మరణంపై మాజీ CFO...

Bengaluru CFO Bribes : “లంచాలు ఇచ్చి విసిగిపోయాను” – కూతురు మరణంపై మాజీ CFO భావోద్వేగ పోస్ట్ వైరల్

Bengaluru CFO Bribes : బెంగళూరులో ఒక తండ్రి భావోద్వేగానికి గురై లింక్డిన్‌లో పోస్ట్ చేసిన విషయం నెట్టింట్లో వైరల్ అయింది. కె.శివకుమార్ (55), BPCL మాజీ CFO, కుమార్తె అక్షయ (34) మెదడులో రక్తస్రావం వల్ల సెప్టెంబర్‌లో మరణించింది. బీటెక్, IIM అహ్మదాబాద్ MBA పూర్తి చేసి, గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేసిన అక్షయ మరణం తర్వాత తండ్రి లంచాలు ఇచ్చి విసిగిపోయానని పోస్ట్ చేశాడు. అంబులెన్స్ డ్రైవర్‌కి రూ.3,000, పోలీసులకు FIR, పోస్ట్‌మార్టం కాపీలకు డబ్బు, శ్మశాన సిబ్బందికి, సిబ్బందికి మొత్తం రూ.10,000 పైగా ఇచ్చానని చెప్పాడు. “నా బిడ్డ చనిపోయినా ఎవరూ కనికరం చూపలేదు. పేదలు ఏమంటారు?” అని భావోద్వేగంగా వ్రాశాడు. పోస్ట్ తొలగించినా స్క్రీన్‌షాట్‌లు వైరల్ అయ్యాయి.

- Advertisement -

ALSO READ: Dating apps : డేటింగ్ యాప్‌ల చీకటి కోణం – సైబర్ నేరగాళ్ల ఉచ్చులో యువత!

ఈ పోస్ట్ వైట్‌ఫీల్డ్ పోలీస్ దృష్టికి వచ్చింది. తక్షణం స్పందించి, లంచాలు తీసుకున్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. “అనుచిత ప్రవర్తనను సహించము” అని Xలో పోస్ట్ చేశారు. శివకుమార్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అంబులెన్స్ డ్రైవర్, శ్మశాన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన బెంగళూరులో అవినీతి, లంచాలు పై చర్చలకు దారితీసింది. నెటిజన్లు “పేదలు ఏమంటారు?” అని ప్రశ్నలు లేవనెత్తారు.

శివకుమార్ పోస్ట్ – “అంబులెన్స్‌కి రూ.3,000, FIR కాపీకి పోలీసులకు డబ్బు, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌కి మరో లంచం, శ్మశాన సిబ్బందికి మొత్తం రూ.10,000 దాటి ఇచ్చాను. నా దగ్గర డబ్బు ఉంది, కానీ పేదలు ఏమంటారు? బిలియనీర్లు (నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్‌జీ, కిరణ్ మజుందార్) ఈ నగరాన్ని కాపాడగలరా?” అని ఉద్వేగంగా వ్రాశాడు.
ఇలా పోస్ట్ చేసిన కాసేపటికే తొలగించినా పోస్ట్ తొలగించినా వైరల్ అయింది. నెటిజన్లు పోలీసుల చర్యలను ప్రశంసించారు. “పేదలు ఫిర్యాదు చేస్తే ఇలాంటి చర్యలు తీసుకోవాలి” అని చెప్పారు. ఈ ఘటన బెంగళూరులో అవినీతి పై అవగాహన పెంచుతుంది. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్. శివకుమార్ కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయం బెంగళూరు, కర్ణాటక రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పేదలు, మధ్యతరగతి వారు లంచాలు ఇవ్వకుండా ఫిర్యాదు చేయాలని సూచనలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad