దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈనెల 20వ తేదీన చేపట్టిన ‘భారత్ బంద్’ (Bharat Bandh) వాయిదా పడిన సంగతి తెలిసిందే. భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన చేపట్టిన భారత్ బంద్‌ను జులై 9వ తేదీన చేపడతామని సంబంధింత సంఘాలు తాజాగా ప్రకటన విడుదల చేశాయి.
కార్మికులకు అనుకూలంగా ఉండాల్సిన శ్రామిక విధానాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతన విధానం, పెన్షన్ హక్కులు వంటి అంశాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లేబర్ కోడ్ రద్దు, ప్రైవేటీకరణను నిలిపివేయడం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం వంటి డిమాండ్లతో ఈ బంద్ చేపట్టనున్నాయి. కార్మికులకు కనీస వేతనం.. 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పెన్షన్ 9000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.