Bharat Taxi By Central Government: దేశంలో క్యాబ్ సర్వీసు రంగంలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు ఓలా, ఉబర్‌లకు షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. సదరు క్యాబ్ సర్వీసుల వల్ల డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి రావడంతో వారికి మద్దతుగా నిలిచేందుకు ‘భారత్ ట్యాక్సీ’ని ప్రవేశపెట్టనుంది.
Also Read: https://teluguprabha.net/business/advertising-legend-piyush-pandey-passes-away/
డ్రైవర్ల ఆదాయం నుంచి ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీస్‌లు అధిక కమీషన్లు తీసుకోవడంతో పాటు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల రెయిడ్ బుక్ చేసుకున్న ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారత మొదటి కో-ఆపరేటివ్ ట్యాక్సీ సర్వీస్ ‘భారత్ ట్యాక్సీ’ని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ సర్వీస్ ద్వారా డ్రైవర్లు లేదా వాహన యాజమానులు కంపెనీకి ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పని లేదు. వారు పూర్తి చేసిన ప్రతి రైడ్ ఆదాయం 100 శాతం డ్రైవర్లకే చేరుతుంది. ఇది ప్రైవేట్ క్యాబ్ సర్వీస్‌లకు పెద్ద ఛాలెంజ్ కానుంది.
ఈ ఏడాది డిసెంబర్ నుంచి ‘భారత్ ట్యాక్సీ’ సర్వీస్ ప్రారంభం కానుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా నవంబర్‌లో రాజధాని ఢిల్లీలో అమలు కానుంది. ఈ పైలట్ ప్రాజెక్టులో 650 మంది డ్రైవర్లు/వాహన యజమానులు పాల్గొననున్నారు. అంటే ఢిల్లీలో 650 వాహనాలు సర్వీస్‌కు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ నాటికి సుమారు 5,000 మంది డ్రైవర్లను చేర్చనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రజలకు సేవలు అందించేలా అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/jaishankar-uno-freedom-rights-response-india-reforms/
మొదటి దశలో ఢిల్లీతో పాటు ముంబై, పూణే, భోపాల్, లక్నౌ, జైపూర్ మొదలైన 20 నగరాల్లో సేవలందించనుంది. ఈ మేరకు ‘సహకార్ టాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్’తో కేంద్రం ఎంఓయూ (MoU) కుదుర్చుకుంది. సహకార మంత్రిత్వ శాఖ , నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) కలిసి ఈ సర్వీస్‌ను తయారుచేసింది.
ప్రైవేట్ కంపెనీల మాదిరిగా కాకుండా ‘భారత్ ట్యాక్సీ’ సహకార సంస్థగా ఉంటుంది. డ్రైవర్లు ఇందులో కో-ఓనర్లు. ‘సహకార్ ట్యాక్సీ’ ఆధ్వర్యంలో భారత్ ట్యాక్సీ నడుస్తుంది. టూ వీలర్లు, ఆటోలు, ఫోర్ వీలర్లు సహకార్ ట్యాక్సీలో భాగంగా సేవలందిస్తాయి. డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మెంబర్‌షిప్ కోసం స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. 2026, మార్చి నాటికి భారత్ ట్యాక్సీ సేవలు దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. 2030 నాటికి లక్ష మంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం చేయాలనే కేంద్రం యోచనలో ఉంది.


