Monday, January 20, 2025
Homeనేషనల్Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో రాహుల్‌పై క్రిమినల్ విచారణను నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -

రాహుల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం తాజాగా విచారించింది. రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. బాధిత వ్యక్తి మాత్రమే పరువునష్టం కేసు వేయగలరని వాదించారు. ఇదే విషయాన్ని న్యాయస్థానాలు అనేక తీర్పుల ద్వారా వెల్లడించాయని ధర్మాసనం దృష్టికి తీసుకుకెళ్లారు. ఆయన వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం బీజేపీ కార్యకర్త నవీన్ షూ వేసిన పరువు నష్టం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News