HomeTop StoriesAIADMK MLA resigns: అన్నాడీఎంకే టు టీవీకే.. ఆగని వలసలు.. తమిళనాట అసలేం జరుగుతోంది?

AIADMK MLA resigns: అన్నాడీఎంకే టు టీవీకే.. ఆగని వలసలు.. తమిళనాట అసలేం జరుగుతోంది?

Big shock for AIADMK: తమిళనాడు రాజకీయాల్లో నెంబర్‌ గేమ్‌ ఇంకా నడుస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార టీవీకేలోకి క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరుగా అన్నాడీఎంకేను వీడి టీవీకే బాట పడుతున్నారు. విజయ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఈ వలసల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా, మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే టీవీకేలోకి జంప్‌ అయ్యాడు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యే రాజీనామా చేసి టీవీకేకి మద్ధతునిచ్చాడు. అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ ప్రభాకర్‌కు తన రాజీనామా సమర్పించారు.

- Advertisement -

Also Read: Buses burned: ఇవేం ఎండలు బాబోయ్‌..! ఎండ తీవ్రతతో కాలి బూడిదైన బస్సులు..! ఎక్కడంటే?

వరుసగా అన్నాడీఎంకేను వీడుతున్న నేతలు..

కాగా, ఇటీవల పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మరగాథం, సత్యభామ, జయకుమార్ రాజీనామా చేసి స్పీకర్‌ను నేరుగా కలిసి తమ రాజీనామా లేఖలను అధికారికంగా అందజేశారు. ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసిన వెంటనే ఈ ముగ్గురూ టీవీకే ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఆదవ్ అర్జునతో భేటీ అయ్యారు. మంత్రి అర్జున సమక్షంలో వీరు త్వరలోనే అధికారికంగా టీవీకే కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. టీవీకేలోకి వెళ్లేందుకే వీరు తమ పదవులను త్యాగం చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రభుత్వం ఎదుర్కొన్న బలపరీక్షలో అన్నాడీఎంకే విప్‌ను ధిక్కరించి మరీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్ వైపు నిలబడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి విజయ్ సర్కార్‌ను సుస్థిరం చేయడంలో కీలక పాత్ర వహించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకే ముందస్తుగా తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీరి రాజీనామాతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే జరగబోయే ఉపఎన్నికల్లో వీరు ముగ్గురూ టీవీకే పార్టీ టికెట్‌పైనే పోటీ చేయనున్నారు. ఇప్పుడు వీరికి మరో ఎమ్మెల్యే తోడవ్వడంతో తమిళ రాజకీయం మరోసారి హీటెక్కుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News