Homeనేషనల్ITR Filing: అందుబాటులోకి ఐటీఆర్‌-2 ఫారమ్‌.. ఎవరు ఫైలింగ్‌ చేయొచ్చంటే?

ITR Filing: అందుబాటులోకి ఐటీఆర్‌-2 ఫారమ్‌.. ఎవరు ఫైలింగ్‌ చేయొచ్చంటే?

Big Update on ITR Filing: మీరు ఇన్‌కమ్‌ టాక్స్‌ ఫైలింగ్‌ చేస్తున్నారా? అయితే, మీకో బిగ్‌ అప్‌డేట్‌. ఐటీఆర్‌ ఫైలింగ్‌కు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ www.incometax.gov.inలో ఐటీఆర్‌-2 ఫారాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్‌-2 ఆన్‌లైన్ ఫైలింగ్‌, ఎక్సెల్‌ యుటిలిటీని అందుబాటులోకి తెచ్చినట్లు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసింది. చిన్న, మధ్యస్థాయి ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్‌-1, ఐటీఆర్‌ 4ను మే 15న ఐటీ విభాగం అందుబాటులోకి తెచ్చింది. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, లేదా ఇళ్లు/స్థలాల ఆస్తుల అమ్మకం ద్వారా మూలధన లాభాలు లేదా నష్టాలు ఉన్నవారు, విదేశాల నుంచి ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్‌-2 ఫారం ద్వారా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

- Advertisement -

Also read: ED Raids on Vijayan: విజయన్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. అధికారుల కార్లపై కార్యకర్తల దాడి..!

ఎవరెవరు ఐటీఆర్‌-2 ఫైలింగ్ చేయాలి?

ఒకవేళ వార్షికాదాయం రూ.50 లక్షలలోపు ఉండి, జీతం లేదా పింఛను ద్వారా ఆదాయం వచ్చే వారు ఐటీఆర్‌-1ను సెలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది వచ్చిన కొత్త మార్పుల ప్రకారం రెండు ఇళ్ల వరకూ ఆస్తి ఉన్నవారూ ఐటీఆర్‌-1 వాడుకునే వెసులుబాటు కల్పించారు. సెక్షన్‌ 112ఏ కింద రూ.1.25 లక్షల లోపు దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్‌టీసీజీ) ఉన్నవారూ ఈ ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయవచ్చు. మరోవైపు, సొంత వ్యాపారం లేదా ఉద్యోగాలు చేసే వారు, షేర్‌ మార్కెట్లో ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) లావాదేవీలు చేసేవారు ఐటీఆర్‌-3, ఐటీఆర్‌-4 (సుగమ్‌)ను ఉపయోగించి ఫైలింగ్‌ చేయవచ్చు. కాగా, ఐటీఆర్‌కు సంబంధించిన కీలక ఫారాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రిటర్నులు దాఖలు ప్రక్రియ ప్రారంభించవచ్చు. అయితే, వేతన జీవులు ఫారం-16 అందుకున్నాకే రిటర్నులు దాఖలు చేయడం చేయడం శ్రేయస్కరం. ఐటీఆర్‌-2 ఫైలింగ్‌ ప్రక్రియ జులై 31లోపు పూర్తి చేయాలని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News