HomeTop StoriesNitish Kumar: "అవును రాజ్యసభకు పోటీ చేస్తున్నా.. అది నా చిరకాల కోరిక"

Nitish Kumar: “అవును రాజ్యసభకు పోటీ చేస్తున్నా.. అది నా చిరకాల కోరిక”

CM Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ నీతీశ్‌కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు పోటీచేయనున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. బిహార్‌ శాసన సభ, మండలి, పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహించాలనేది తన చిరకాల కోరిక అని తెలిపారు. అది నేరవేర్చుకునేందుకే తాను రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లుగా నితీశ్‌ పేర్కొన్నారు.

- Advertisement -

నితీశ్‌ వారసుడు ఎవరు?: నితీశ్‌ కుమార్ రాజ్యసభకు పోటీచేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో బిహార్‌ రాజకీయల్లో ఉత్కంఠ నెలకొంది. బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్న నితీశ్‌ కుమారుడు నిశాంత్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖాయమైంది. దీనిపై జేడీయూ వర్గాల నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నట్లుగా తెలుస్తోంది. నిశాంత్ రాజకీయాల్లోకి రావడంపై నితీశ్‌ సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు నేరుగా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి నితీశ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరపడం ఈ మార్పులకు బలం చేకూరుస్తోంది.

ముగియనున్న నితీశ్‌ పాలన: గత నవంబర్ 20న పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్‌ కుమార్.. బిహార్‌ను అత్యంత ఎక్కువ కాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించారు. అయితే ప్రమాణం చేసిన నాలుగు నెలలలోపే ఆయన పదవి నుంచి వైదొలగనుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News