Sunday, November 16, 2025
Homeనేషనల్PM Modi Mother: మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కార్యకర్త అరెస్టు

PM Modi Mother: మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కార్యకర్త అరెస్టు

Comments On Modi Mother: బిహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు నిర్వహిస్తున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన రాజకీయ దుమారం రేపింది. దర్భంగా జిల్లాలోని బితౌలీలో జరిగిన ఈ సంఘటనలో కాంగ్రెస్ కార్యకర్త మొహమ్మద్ రిజ్వి అలియాస్ రాజాను పోలీసులు అరెస్టు చేశారు. సింగ్వారా మండలంలోని భాపుర గ్రామానికి చెందిన రిజ్వి, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, తేజస్వీ యాదవ్ బ్యానర్లున్న వేదిక నుంచి మోదీని దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడని పోలీసులు తెలిపారు.

ALSO READ : Bihar Voter List: బీహార్‌లో ఓట్ల భూకంపం.. జాబితాలో అఫ్గాన్.. బంగ్లా వాసుల కలకలం!

- Advertisement -

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసిన బీజేపీ, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌ల నుంచి క్షమాపణ డిమాండ్ చేసింది. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలను “అవమానకరం, భారత సంస్కృతికి విరుద్ధం” అని విమర్శించారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ కూడా ఈ చర్యను అసభ్యకరమని ఖండించారు.

ALSO READ : Vijay Thalapathy: పరువు హత్యలపై ‘దళపతి’ పోరాటం.. సుప్రీంకోర్టుకెక్కిన విజయ్ పార్టీ!

కాంగ్రెస్ నేత మొహమ్మద్ నౌషాద్, ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, తప్పు జరిగితే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. అయితే, కాంగ్రెస్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. సిమ్రీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదై, విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad