Bihar Exit Polls Highest Seats to NDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతలో భాగంగా 122 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. దాదాపు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వీరిలో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు స్థాయి పోలింగ్ అని అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయేకే పట్టం కట్టనున్నట్లు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి.
బిహార్‌లో మొత్తం 243 స్థానాలు ఉండగా.. నవంబర్ 6న మొదటి విడతలో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. నేడు రెండో విడత పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార పక్షానికి మెజార్టీ మార్కు 122 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Also rEAD: https://teluguprabha.net/national-news/delhi-bomb-blast-rs-10-lakhs-ex-gratia-to-victims/
అధికార ఎన్డీయే 133- 159 స్థానాల్లో గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. మహాగఠ్‌బంధన్‌కు 75-101 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ ప్రభావం అంతగా లేదని.. 0- 5 స్థానాల్లో గెలిచే అవకాశముందని తెలిపింది. ఇతరులు 2-8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-exit-polls-survey-majority-votes-to-congress/
దైనిక్ భాస్కర్ సర్వే ఎగ్జిట్ పోల్స్
ఎన్డీయే- 145- 160
మహాగఠ్‌బంధన్- 73- 91 స్థానాల్లో గెలుస్తాయని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి.
మ్యాట్రిజ్
ఎన్డీయే- 147- 167
మహాగఠ్‌బంధన్- 70- 90
ఇతరులు- 2- 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తాయని మ్యాట్రిజ్ అంచనా వేసింది.
పీపుల్స్ ఇన్‌సైట్
ఎన్డీయే- 133- 148
మహాగఠ్‌బంధన్- 87- 102
ఇతరులు- 3- 6 స్థానాలు గెలుస్తాయని పీపుల్స్ ఇన్‌సైట్ అంచనా వేయగా జన్ సురాజ్ పార్టీ- 0- 2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. నవంబర్ 14 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.


