Homeనేషనల్Bihar:సీఎం రాజీనామా చేయాలి..ఆరేళ్ల బాలుడి సంచలన వ్యాఖ్యలు

Bihar:సీఎం రాజీనామా చేయాలి..ఆరేళ్ల బాలుడి సంచలన వ్యాఖ్యలు

పట్నా, (తెలుగుప్రభ): బిహార్‌లో విద్యార్థుల ఆందోళనలో ఆరేళ్ల బాలుడు ఆదిత్య చేసిన సూటి, ధైర్యమైన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బీపీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన డిమాండ్లపై మంగళవారం జరిగిన నిరసనలో పాల్గొన్న ఆదిత్య.. ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌధరీ రాజీనామా చేయాలని, లాఠీచార్జ్‌కు ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.పట్నాలోని పునైచక్‌ ప్రాంతానికి చెందిన ఆదిత్య టీషర్ట్‌, జీన్స్‌ ధరించి, నుదుటన తిలకంతో నిరసనలో కనిపించాడు.

- Advertisement -

ఆ తర్వాత పోలీసులు అతడిని తల్లిదండ్రులకు అప్పగించి, బాలుడి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదిత్యను పోలీసులు అరెస్టు చేశారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ.. పోలీసులు దాన్ని ఖండించారు. ఆందోళన పరిస్థితుల నేపథ్యంలో బాలుడి భద్రత కోసం కొంతసేపు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచి, అనంతరం ఇంటి పనులు చేసే అతడి తల్లికి అప్పగించినట్లు తెలిపారు.

Also Read:Mohan Bhagwat:న్యూయార్క్‌లో భాగవత్‌ కార్యక్రమంపై దుమారం

విద్యార్థుల ఆందోళనలో బాలుడిని చూసిన పలువురు ‘జెన్‌ ఆల్ఫా’ అంటూ నినాదాలు చేశారు. తన చుట్టూ జరుగుతున్న విషయాలపై ఆసక్తితోనే నిరసనలో పాల్గొన్నానని, భవిష్యత్తుపై ఆందోళనతో పౌరుడిగా తన హక్కులను వినియోగించుకున్నానని ఆదిత్య విలేకరులతో చెప్పడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News