Sunday, October 6, 2024
Homeనేషనల్Covid Positive : బిల్ క్లింటన్ కు కరోనా పాజిటివ్

Covid Positive : బిల్ క్లింటన్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండగా.. కొన్నిదేశాల్లో కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి కారణమైన చైనాలో రాకాసి వైరస్ కట్టలు తెంచుకుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు బయటపడుతుండటంతో.. అక్కడి ప్రజలు ముందు జాగ్రత్తగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషీన్లను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్వీట్ చేశారు.

- Advertisement -

తనకు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని బిల్ క్లింటన్ తెలిపారు. వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వేయించుకోవడం వల్ల కరోనా తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News