ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్(Bill Gates) ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులను కలుస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ బెంచ్‌పై ఇద్దరు కూర్చుని భారత స్పెషల్ వంటకమైన వడాపావ్ రుచి చూశారు.
- Advertisement -
ఇందుకు సంబంధించిన వీడియోను బిల్ గేట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోకు ‘సర్వింగ్ వెరీసూన్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రసుత్తం వీడియో వైరల్‌గా మారింది. దీనికి మాజీ క్రికెటర్లు యువరాజ్, ధావన్ లైక్ చేశారు. కాగా బిల్‌గేట్స్ మూడోసారి భారత్‌లో పర్యటిస్తున్నారు.