Saturday, November 15, 2025
Homeనేషనల్Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. 71 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ విడుదల...

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. 71 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ విడుదల చేసిన కమలం పార్టీ

BJP Announces Candidates list in Bihar Elections 2025: దేశం మొత్తం బీహార్ ఎన్నికలవైపే చూస్తోంది. ఈ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పొత్తులు, ఎత్తుల ద్వారా బీహార్‌ పీఠం నెగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్‌, ఆర్జేడీ తేజస్వీ యాదవ్‌ మధ్య టికెట్ల పంచాయితీ నడుస్తోంది. అయితే, బీజేపీ మాత్రం టికెట్ల కేటాయింపు సజావుగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా, 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరూ ఉన్నారు. చౌదరి తారాపూర్ నుండి పోటీ చేయనుండగా, సిన్హా లఖిసరాయి నుండి పోటీ చేయనున్నారు. సిన్హా 2005, 2010, 2015, 2020 వరుస ఎన్నికల్లో నాలుగు సార్లు లఖిసరాయ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

- Advertisement -

ప్రముఖులు ఏఏ స్థానంలోంచి పోటీలో ఉన్నారంటే..!

మాజీ ఉప ముఖ్యమంత్రులు రేణు దేవి (బెట్టియా), తార్కిషోర్ ప్రసాద్ (కటిహార్), మంగళ్ పాండే (సివాన్), నితీష్ మిశ్రా (ఝంఝార్‌పూర్), నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ (ఛాతాపూర్), విజయ్ కుమార్ మండల్ (సిక్తి), సంజయ్ సరోగి (ఎస్‌ఎస్‌ దర్భంగా), సున్‌మర్‌త కుమార్‌ బంధీర్ సింగ్ (మద్ కుమార్ రంధీర్ సింగ్) (బంకిపూర్), డాక్టర్ ప్రేమ్ కుమార్ (గయా టౌన్) మరియు సిద్ధార్థ్ సౌరవ్ (బిక్రమ్) వంటి ప్రముఖులకు టికెట్లు ఖారారయ్యాయి. ఇక, మహిళల విషయానికి వస్తే.. రేణు దేవితో పాటు, శ్రేయసి సింగ్ (జముయి), అరుణా దేవి (వర్సలిగంజ్), రమా నిషాద్ (ఔరై), నిషా సింగ్ (ప్రాన్పూర్), కవితా దేవి (కోర్హా), స్వీటీ సింగ్ (కిషన్గంజ్), దేవంతి యాదవ్ (నర్పత్గంజ్), గాయత్రి దేవి (పరిహార్) సహా మరో 8 మంది మహిళా అభ్యర్థుల పేర్లను బిజెపి ప్రకటించింది.

స్పీకర్‌ నంద్ కిషోర్ యాదవ్‌కు బిగ్‌ షాక్‌..

బీజేపీ ప్రకటించిన 71 మందిలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్‌ పేరు లేకపోవడం ఆసక్తికరగంగా మారింది. ఆయనకు టికెట్‌ కేటాయించలేదు. కాగా, 2024లో పాట్లీపుత్ర నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌ను పార్టీ దానాపూర్ నుంచి బరిలోకి దింపింది. పాట్నాలోని కుమ్రార్ నుంచి టికెట్‌ను వదులుకున్న అరుణ్ సిన్హా, తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రెండు రోజుల ముందే స్వయంగా ప్రకటించారు. 243 మంది సభ్యులు గల బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆర్జేడీ చెరో 101 స్థానాలలో బరిలో దిగనున్నాయి. పొత్తులో భాగంగా సమానంగా సీట్లు పంచుకోనున్నాయి. అయితే, ఇటు బీజేపీ, ఆర్జేడీ పార్టీలు టికెట్లు కేటాయిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌, తేజస్వీ యాదవ్‌ కూటమి మాత్రం సీట్ల కేటాయింపులో తర్జన భర్జన పడుతున్నాయి. ఎవరికే వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad