West Bengal Falta Constituency: గత నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫల్టా నియోజకవర్గంలో ఓటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మే 21న రీపోలింగ్ నిర్వహించారు. ఈరోజు కౌంటింగ్ జరగ్గా ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి లక్షకి పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
Also Read: https://teluguprabha.net/telangana/rangareddy-news/terror-suspect-arrested-in-medchal/
ఫల్టా నియోజకవర్గంలో మొత్తం 285 బూత్‌లలో జరిగిన రీపోలింగ్ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దెబాంగ్షు పాండా 1,09,021 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి అయిన సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మీని ఓడించారు. కాగా శంభునాథ్‌కి 40 వేల ఓట్ల సాధించి రెండో స్థానంలో నిలిచారు. కాగా, నియోజకవర్గంలోని మొత్తం 2.36 లక్షల ఓటర్లలో రీపోలింగ్ రోజున 87 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-key-decision-more-safety-for-women/
ఇదిలా ఉండగా.. టీఎంసీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో రీపోలింగ్‌కి ముందే ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి దేవాంగ్షు పాండా, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా, సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మీల మధ్యే నెలకొంది. ఈ నియోజకవర్గంలో గెలుపును బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, ఆ పార్టీ ఆశించినట్లుగానే లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

