BJP Counter to Rahul gandhi: ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా దేశాల పర్యటనలపై ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు నాయకత్వం అనిపించుకోవని, కేవలం జిమ్మిక్కులో భాగమేనని విమర్శించారు. మరోవైపు, పొదుపు చర్యల్లో భాగంగా కొంతకాలం విదేశీ పర్యటనలు చేయొద్దని సలహాలిచ్చిన ప్రధాని మోదీ.. ఆయనే పాటించడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే దేశంలో గ్యాస్, ఎరువులు, ఇంధనాల సరఫరా పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో భాగంగా ఇటలీ వెళ్లిన మోదీ ఆ దేశ ప్రధాని మెలోనికి ‘మెలోడి’ చాక్లెట్లు ఇచ్చిన విషయాన్ని ఉదహరిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Also read: NTR Birthday: కండలు తిరిగిన చేతుల్లో పిచ్చుకను పట్టుకొని.. ఎన్టీఆర్ బర్త్‌డే పిక్ వైరల్
పాక్ చేతిలో కీలుబొమ్మగా రాహుల్…
కాగా, రాహుల్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలను భాజపా అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తిప్పికొట్టారు. రాహుల్ వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని.. పాక్ నేతల డైరెక్షన్‌లోనే ఆయన మాట్లాడతారని విమర్శించారు. ప్రధానిని అగౌరవపరచడం రాహుల్‌కి అలవాటుగా మారిపోయిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

